ప్రియ….

ప్రియ విద్యార్థిని. చదువుల్లోనూ తెలివితేటల్లోను ఎప్పుడూ ముందే, కానీ తనది ఒక పేద కుటుంబం. పల్లెటూరు వాతావరణం. మంచి సంబంధం వచ్చిందని డిగ్రీ పూర్తికాకముందే తనను అడగకుండా సంబంధం నిశ్చయించారు. తన ఇష్టలకన్న తన తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యం అనుకోని తలవంచి పెళ్లి చేసుకుంది.

కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త సంబంధాలు, కొత్త బాధ్యతలు, కానీ తన తెలివితేటలతో అందరి మనసును గెలిచింది.
ప్రియ జీవితం కొంతకాలం వరకు ప్రేమానురాగాలతో సాగింది, వారికి ఇద్దరు పిల్లలు కానీ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ప్రియ భర్త తాగుడు బానిసై అనుక్షణం అనుమానిస్తూ, విడిచిపెట్టి వెళ్లిపోతానని బెదిరిస్తూ, తిట్టడం , కొట్టడం మొదలు పెట్టాడు.

అంత వరకు సాఫీగా సాగిన తన జీవితం ఇలాంటి మలుపు తీసుకుంటుందని తను ఎప్పుడూ అనుకోలేదు. ఊహించని ఈ పరిణామానికి బిక్కచచ్చిపోయింది ప్రియా. ఒకరోజు ప్రియ భర్త ప్రియనీ పిల్లల్ని తాగినమైకంలో వదిలి వెళ్ళి పోతాడు.

ఆ క్షణం ప్రియ మనసులో ఎన్నో ఊహలు, ఎన్నో సందేహాలు ఇంటికి పోలేని పరిస్థితి. ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలి అన్న ఆలోచన, కానీ ఒక స్త్రీ అనుకుంటే దేశాన్ని ఏలొచ్చు….. అన్న సంకల్పంతో తన దగ్గర దాచుకున్న డబ్బులు తీసి మరుసటిరోజు కొన్ని పుస్తకాలు కొనుక్కుంది. పిల్లల పాఠశాలలో లైబ్రరీ పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటూ పగలనక రాత్రనక కష్టపడి చదివింది.తన భర్త అప్పుడప్పుడు వస్తూ ,పోతూ అలా అయిదు నెలలు గడిచాయి తను వేచి చూస్తున్న క్షణం రానే వచ్చింది.

ఆరోజు గ్రూప్ 2 రిజల్ట్స్ చిన్నప్పటి నుంచి దేనికోసం అయితే కలలు కని, తల్లిదండ్రుల కోసం ఏ కలనైతే త్యాగం చేసిందో , దీనికోసం అయితే శ్రమించింది ఆ రోజు ఆమె కలలన్నీ సాకారం అయ్యాయి . ఎవరైతే అనుమానించి, అవమానించినారో ఇప్పుడు నీ దగ్గరే ఉంటా, అనే పరిస్థితికి వచ్చాడు, ఇప్పుడు ప్రియా గ్రూప్ 2 ఆఫీసర్.

స్రీ పోషించలేని పాత్ర లేదు. అమ్మగా, ఆదిశక్తిగా, రాణిగా, వ్యోయోగమిగా తను తలుచుకుంటే చాలు ప్రతి పాత్ర తన ముందు చిన్నదే.

స్రీ తాను ఒక ఒంటరి అక్షరం అనుకుంటారు….
శిరస్సు వంచితే అది తన సహనం……
ఆగ్రహిస్తే వదలని గ్రహం….
ఆమె ప్రేమను పొందడం ఒక వరం…..
స్రీ ని బాధిస్తే వీడదు జన్మజన్మలకు తన శాపం…..

✍️ Sumayya

12 thoughts on “ప్రియ….”

Comments are closed.