సహాయం….. ఎవరిది ?

అది ప్రవక్త గారి కాలం. ఆ కాలంలో అందరూ పేదవారే . ఒక పూట తిని రెండుపూటల పస్తులుండే కాలం అది. మన ప్రవక్త వారు కూడా ఎన్నో సార్లు పస్తులుండటం జరిగింది . డబ్బులు ఉన్నవారు కూడా తమ సంపదను దైవమార్గంలో దాన ధర్మాలు, పేదల కొరకు ఖర్చు చేసేవారు.

ఆ కాలంలో ఒక వ్యక్తి ఉండే వారు. వారి ఇంట్లో వరుసగా 4 రోజులుగా తినడానికి ఏమి లేక ఇంట్లో వారందరూ పస్తులుండేవారు . ఏమి తోచని దయనీయమైన పరిస్థితిలో ఉన్న అతను వెంటనే భగవంతుని ముందు ప్రార్ధించడం మొదలు పెట్టాడు .

ఆ సమయంలో ఒక ఎలుక తన దగ్గరకు వస్తది. అది అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు అతను తన టోపీ ఆ ఎలుక మీద సరదాగా వేస్తాడు. అంతలోనే ఇంకో ఎలుక వచ్చి మొదట టోపీ చుట్టూ తిరగ సాగింది. కొద్ది సేపటి తర్వాత తన మిత్రుడు బయటకి వచ్చే జాడ కనబడక , గిర్రున తన బిలంలోకి వెళ్ళి ఒక్కొక్క బంగారు నాణెం చొప్పున 14 బంగారు నాణేలు తెచ్చి ఆ వ్యక్తి ముందు వేసి చేతులు జోడించి ఇలా అంటది, ” నా దగ్గర ఇన్నే ఉన్నాయి. ఇవి తీసుకొని నా స్నేహితుడిని వదిలివేయీ” అని అభ్యర్థించింది . ఆ వ్యక్తి వెంటనే ఆశ్చర్యంతో తన టోపీని ఎలుక పై నుండి తీసివేశాడు . వెంటనే ఆ రెండు ఎలుకలు రయ్యేమని బీలంలోకి పరిగెడుతాయి.

అప్పుడు ఆ వ్యక్తి 14 బంగారు నాణేలు తీసుకొని ప్రవక్త దగ్గరికీ వెళ్ళి మొత్తం విషయాన్ని వివరిస్తారు. అప్పుడు ప్రవక్త వారు “ఇవన్నీ మీ కోసమే , మీ ప్రార్థనను అల్లాహ్ విని ఊహించని రీతిలో సహాయం పంపించారు ” అని సెలవిచ్చారు.

ఎటువంటి సమస్య, అపాయం , ఇబ్బంది ఎదురైన, పరిస్తితి ఎలాంటిదైనా , నమ్మకం దృఢంగా ఉండాలి . అపాయంకంటే పెద్దవాడు సృష్టికర్త అని నమ్మితే ఎలాంటి అపాయం నుంచైనా బయటకు రావచ్చు .

✍️ Sumayya

6 thoughts on “సహాయం….. ఎవరిది ?”

Comments are closed.