న్యాయం


ఒక భూమి విషయంలో యూదులకు , ముస్లింలకు వివాదం ఏర్పడింది. అది వాళ్ళ వాళ్ళ తాతముత్తతలకు చెందినది అని ఇరువురు గొడవపడుతుంటారు మరి సమస్య తేలాలంటే ఎవరో ఒకరు న్యాయం చెప్పాల్సిందే అయితే అప్పుడు యూదులు అంటారు ” మొత్తం మక్కా నగరంలో అబద్దం చెప్పనివారు , అధర్మం చెయ్యనివారు ఒకే ఒక్కరు అక్కడికి వెళ్దాం ” దానికి ముస్లింలు ” అలా ఎలా ? మా మతపెద్దల దగ్గర వెళ్దాం ” అనిర్ వాదించినా చివరికి వారితో వెళ్తారు అది మరెవరో కాదు ప్రవక్త మొహమ్మద్ ( స.వ.అ) గారు.

అక్కడికి వెళ్ళి వారు ” మీరు చెప్తే మేము మొత్తం భూమి విడిచి వెళ్ళిపోతాం ” అని అంటారు. అందరి ముస్లింల ముఖాల్లో సంతోషం ఇక భూమి మాకే దక్కుతుంది అన్న ఆనందం. అప్పుడు ప్రవక్త వారు ఇరువైపు వాదనలు వింటారు. ప్రవక్త ఏ నిర్ణయం తీసుకోకుముందే అల్లాహ్ నుండి ఒక దేవదూత ద్వారా వహి (సందేశం) వస్తుంది. వహి వచ్చిన తర్వాతే ప్రవక్తవారు మాట్లాడుతారు ఆ భూమి యూదులదే అని తీర్పు ఇస్తారు.


ముందు ఉన్నది ఎవరైనా సరే నిర్ణయం న్యాయంగా ఉండాలి పరిస్తితి ఎలా ఉన్నా నోటి నుంచి నిజం తప్ప ఏమి రాకూడదు ఇదే ప్రవక్తగారి లక్షణాలు మానవాళికి ఇచ్చిన సందేశం

  • SUMAYYA

13 thoughts on “న్యాయం”

Comments are closed.