మనం తెలుగు లో రాస్తే gboard English లో రాసేస్తుంది…ఇక పై మనం English లో conversation చేయడం మరింత సులువు..

మిత్రులారా మనము మన మొబైల్ ఫోన్ లో ఇంగ్లీష్ లో ఉన్న సమాచారాన్ని తెలుగులో చదవడానికి గూగుల్ ట్రాన్స్లేట్నో వినియోగిస్తున్నాము అయితే ఇప్పటివరకు మనం కేవలం చదవడానికి మాత్రమే గూగుల్ ట్రాన్స్లేటర్ ను వాడుతూ వస్తున్నాము.

ఇప్పుడు మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను అదేంటంటే సాధారణంగా మనందరం కూడా మన మొబైల్ ఫోన్లలో ఏదైనా మెసేజ్ టైప్ చేయడానికి గూగుల్ కీబోర్డ్ ని వాడుతాం కీబోర్డ్ లో ఉన్న ఆప్షన్స్ ఉంటాయి మనము సరిగ్గా గమనించము.

ఐతే మీకు ఇక్కడ ఉన్న ఒక ఆప్షన్ ను మీకు తెలియజేస్తాను మనం ఏదైనా మెసేజ్ టైప్ చేయడానికి కీ పాడ్ ను ఓపెన్ చేయగానే అక్కడ పైన మనకు గూగుల్ ట్రాన్స్లేట్ సింబల్ మనకు కనబడుతుంది.

ఆ సింబల్ ను tap చేశాక అక్కడ మనకు మనమే భాషలో మాట్లాడుతున్నామో సెలెక్ట్ చేసుకునేందుకు ఎడమవైపు ఒక ఆప్షన్ అడుగుతుంది అదేవిధంగా బాణం గుర్తు మధ్యలో ఉండి కుడివైపు మన భాషలోకి మనం ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ భాషని మనము సెలెక్ట్ చేసుకోవాలి.

అయితే మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ కి మెసేజ్ ను ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే మనము గూగుల్ ట్రాన్స్లేట్ సింబల్ టాప్ చేశాక,ఎడమవైపు సెలెక్ట్ చేసుకునే భాష దగ్గర తెలుగు ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో arrow సింబల్ ఉంటుంది ఇప్పుడు కుడి వైపున మనము ఏ భాషలో కి చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఆ లాంగ్వేజ్ కింద ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ మనం తెలుగులో మెసేజ్ రాగానే ఆ పైన ఉన్న బాక్స్లో ఆటోమేటిక్ గా అది ఇంగ్లీషులో ఇటువంటి వ్యాకరణ దోషాలు లేకుండా సరైన సెంటెన్స్ ఫార్మేషన్ లో కనబడుతుంది. (కొన్ని సందర్భాల్లో మనం సరి చూసుకోవాల్సి ఉంటుంది.)

step 1
step 2