తెలంగాణ రాష్ట్రం ఆన్‌లైన్ తరగతుల మార్గదర్శకాలు | TS Online Classes guidlines in telugu

అన్ని పాఠశాలలకు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం మార్గదర్శకాలు :

కోవిడ్ – 19 వలన గత మార్చి 15, 2020 నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు మూసివేయబడినవి మరియు 1 నుండి 9 తరగతుల విద్యార్థులను 2019-20 విద్యా సంవత్సరమునకు గాను పై తరగతి కి ప్రమోట్ చేయడం జరిగినది. మరియు 10 వ తరగతి విద్యార్థులను కూడా వారి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా అందరి విద్యార్థులను పాస్ చేయడం జరిగింది.

జూన్ 12, 2020 రోజునుండి మొదలు కావలసిన 2020-21 విద్యా సంవత్సరం కూడా కోవిడ్ – 19 వలన ప్రారంభించబడలేదు.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో సెప్టెంబర్ 1, 2020 నుండి ఆన్లైన్ తరగతులు ప్రారంభించుటకు గాను ఆదేశాలు జారీచేయడం జరిగింది. మరియు ఉపాధ్యాయులందరూ కూడా తేది 27.08.2020 నుండి పాఠశాలలకు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీచేయడం జరిగింది మరియు పాఠశాలల ఆన్లైన్ తరగతుల ప్రారంభ విషయంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది.

డిజిటల్ విద్య అమలు :

 • పిల్ల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని క్రింది సిఫార్సు మేరకు వారికి స్ర్కీన్ సమయం కేటాయించడం మంచిది..
తరగతులుఆన్‌లైన్ / డిజిటల్ లెర్నింగ్రోజుకు గరిష్ట స్క్రీన్ సమయం
Kindergarten,
Nursery ,
play school,
Pre-School
తల్లిదండ్రులు / వయోజన పర్యవేక్షకుల సమక్షంలో రోజుకు 45 నిమిషాలు మాత్రమే, వారంలో 3 రోజులకు మించకూడదు45 Minutes
తరగతులు 1 to 12SCERT యొక్క ప్రత్యామ్నాయ అకాడమిక్ క్యాలెండర్‌ను అనుసరించండి
1 to 5రోజుకు 30-40 నిమిషాల రెండు సెషన్ల కంటే ఎక్కువ కాదు, వారంలో 5 రోజులకు మించకూడదు, సంపూర్ణ / వయోజన సూవర్‌వైజర్1.5 Hour
6 to 8రోజుకు 30- 45 నిమిషాల మూడు సెషన్లకు మించకూడదు, వారంలో 5 రోజులకు మించకూడదు2 Hours
9 to 12రోజుకు 30- 45 నిమిషాల మూడు సెషన్లకు మించకూడదు, వారంలో 5 రోజులకు మించకూడదు3 Hours


T- SAT / Dooradarshan ద్వారా తరగతుల నిర్వహణ కోసం షెడ్యూల్

Sl.No.తరగతులుస్క్రీన్ సమయంప్రారంభం
1III to Vరోజుకు ఒకటిన్నర గంటలు1st september ,2020
2VI to VIIIరోజుకు రెండు గంటలు1st september ,2020
3IX to Xరోజుకు మూడు గంటలు1st september ,2020

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మరికొన్ని ప్రత్యేక సూచనలు ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు జారి చేసినారు.

 • అందరు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు 27.08.2020 నుండి కోవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ .పాఠశాలకు హాజరు కావాలని, గ్రామంలో విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులకు హాజరగు విదముగా చర్యలు తీసుకొనవలెను
 • పాఠశాల విద్యార్థులకు ఎంత మంది విద్యార్థులు టి సాట్ మరియు దూరదర్శన్ ఛానల్ ద్వారా మరియు ఎంత మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్స్ కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ తరగతులకు హాజరాగుతున్నారో తెలుసుకోవాలి. సౌకర్యాలు లేని విద్యార్థుల వివరాలు కుడా తెలుసుకొని గ్రామ పంచాయతీ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలలోని టివి లో ఆన్లైన్ తరగతులు వినే విధంగా చర్యలు తీసుకోవాలి.
 • ప్రధానోపాధ్యాయులు పాఠశాలలోని పిల్లలందరికీ ప్రభుత్వ పుస్తకాలు అందేలా చూడాలి. మరియు SCERT Hyderabad వారు రుపొందిచిన వర్క్ షీట్స్ ను కూడా విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారికీ అందించాలి. work sheets
 • గ్రామ పంచాయతి వారి సహకారం తో పాఠశాల తరగతి గదులు మరియు పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా వుండే విధంగా చర్యలు తీసుకోవాలి.
 • ఉపాధ్యాయులు అందరు కూడా విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందించడానికి కావలసిన సదుపాయాలు సమకూర్చు కోవాలి.
 • ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాల యొక్క ఆన్లైన్బో ధన ప్రణాళిక ను తయారు చేసుకోవాలి.
 • విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఆన్లైన్ తరగతులు వినే విధంగా తగు సదుపాయాలు కల్పించి సహకరించాలి.
 • పై విషయములన్నియు సంబధిత మండల విద్యాధికారి పర్యవేక్షించి అమలు తీరు పై వారానికి ఒక సారి ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాటి వివరాలను జిల్లా విధ్యశాఖాధికారి గారికి తెలియజేయాలి.

నూతన విద్యార్థుల నమోదు:

 • 1నుంచి 6 తరగతుల విద్యార్థులను 2020-21 సంవత్సరం.నాకు గాను నూతనముగా నమోదు చేసుకొనుటకు చర్యలు తీసుకోవాలి .
 • నమోదు చేసుకునే సమయంలో కోవిడ్ – 19 నిబంధనలు పాటించాలి.
 • విద్యార్థులు పాఠశాలలకు భౌతికంగా హాజరు కావలసినఅవసరం లేదు.
 • ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలి మరియు వారి వయస్సు ఆధారంగా అర్హత గల తరగతి లో చేర్చుకోవాలి.

Note :

ఈ పై సూచనలు DSC గారు ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా ఉపాధ్యాయుల సౌకర్యార్ధం తెలుగులో మీకందించడం జరిగింది. అధికారికంగా వచ్చిన గైడ్లైన్స్ నే ప్రామాణికంగా తీసుకోగలరు.

To download Official guidlines click here


T-SAT Youtube Channel

DD YADAGIRI TELANGANA