TS TEACHERS work from home – 21సెప్టెంబర్ 2020 నుండి 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యే విధంగా వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు
COVID-19 కారణంగా అన్ని రంగాలలో తీవ్రమైన ప్రభావం చూపింది.
భారతదేశం లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో తెలంగాణ రాష్ట్రం లో విద్యా సంవత్సరం ముగియక ముందే పాఠశాలలకు సెలవు ఇవ్వడం జరిగింది.
సెప్టెంబర్ ఒకటో తారీకు నుంచి డిడి సప్తగిరి మరియు TSAT ఛానల్ లో తెలంగాణ విద్యాశాఖ వారు డిజిటల్ తరగతులు ప్రారంభించడం జరిగింది.
అయితే ఉపాధ్యాయులను మాత్రం ఆగస్ట్ 27 నుండి పాఠశాలకు హాజరుకావాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
ఉపాధ్యాయులు పాఠశాలలు ప్రారంభమైన నుంచి సుమారు 500 మంది దాకా covid 19 బారిన పడటం జరిగింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మరియు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు కదిలి వచ్చిన రాష్ట్రం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.
- ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ ను ప్రోత్సహించాలి, కొనసాగించాలి.
- ఉపాధ్యాయులు అందరూ కూడా 20-09-2020 వరకూ ఇంటివద్దనుండే పనిచేయాలి
- సెప్టెంబర్ 21 నుండి మాత్రమే 50% మించకుండా ఉపాధ్యాయులను పాఠశాలలకు రప్పించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు.

