తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో విద్యార్థులను ఉద్దేశించి యాదగిరి ఛానల్ మరియు టీ సాట్ చానల్ ద్వారా పాఠ్యాంశాలను ప్రసారం చేయిస్తోంది.
అయితే ఆయా ఛానల్స్‌లో ప్రసారమయ్యే పాఠ్యాంశాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా వర్క్ షీట్లను తరగతుల వారీగా విడుదల చేసింది అయితే ఆ ఆ వర్క్షీట్లను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీయాలి అంటే ఒక్కో తరగతికి సుమారుగా గా ఒక్కొక్కరికి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నది.

ఈ సందర్భంలో ఆయా వర్క్షీట్లను ఎవరు ప్రింట్ తీసి విద్యార్థులకు అందించాలో ఖచ్చితమైన guidelines ఇంతవరకు వెలువడలేదు అయితే ఉపాధ్యాయులే వాలంటరీగా ప్రింట్ తీసి పంచుదాం అని అనుకున్నా అవి చాలా పేపర్లు కావడం వల్ల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా పరిణమించింది.
ఈ సమస్యను అధిగమించడం కొరకు విద్యార్థులకు వర్క్షీట్లను అందించే క్రమంలో లో గూగుల్ ఫామ్స్ ను ఏ విధంగా ఉపయోగించాలో మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అందిస్తున్నాము. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇ మా ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి