అతను చెప్పిన దాంట్లో vaasthavam ఉందనిపించింది !!!!!

vaasthavam

ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ని కలవడానికి కొన్ని నెలల క్రితం అతని ఇంటికి వెళ్ళాను.తాను బైట ఎవరితోనో మాట్లాడుతున్నారు.నన్ను లోపల కూర్చోమన్నారు.ఈ మధ్యనే కట్టిన రెండంతస్థుల భవనం అది. పై అంతస్తులో విశాలమైన హాలు …గోడకు టీవీ ..రెండు కుర్చీలు వేసి ఉన్నాయి.నాలుగైదు కుర్చీలు ఓ మూలన ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి.
టీవీ క్రింద చిన్న స్థూలు.. దాని మీద వాటర్ జగ్గూ..రెండు గ్లాసులు ఉన్నాయి.ఇల్లంతా ఖాళీగా వుంది.నేను ఎవరింటికి వెళ్లిన రెండు పెద్ద ఖరీదైనా సోఫాలు..కుషన్ కుర్చీలు…అందమైన టేబుళ్లు ..ఇంటీరియర్ డెకరేషన్ అద్భుతంగా ఉంటుంది.దానికి విరుద్ధంగా ఇల్లు సింపుల్గా ..బోసిపోయినట్టుగా ఉంది.
సర్ రాగానే,”ఏమిటీ సర్..ఇల్లంతా ఖాళీగా ఉంది.ఫర్నీచర్ కొనలేదా..లేకపోతే విదేశాల్లో ఉన్న మీ పిల్లలు తీసుకు వస్తారా?”అని అడిగాను.


ఆయన జవాబు విని ..నివ్వెర పోయాను.”ఇల్లు అనేది నేను ఉండడానికి..నా భార్య ..పిల్లలు స్వేచ్ఛగా తిరగ టానికీ…. ఓ పది నిముషాలు వచ్చి వెళ్లి పోయే మీ లాంటి వారి కోసం..హాలంతా ఆక్రమించేలా ఫర్నిచర్ ఉండాలా… ఏ ఇంట్లో అయితే తక్కువ వస్తువులుంటాయో ఆ ఇంట్లో దుమ్ము ధూళి ఉండదు.ఉన్నా కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది.అయినా ఇల్లు కట్టుకునేది మన కోసం….ప్రదర్శన కోసం పెట్టినట్టు అన్నీ వస్తువులు అవసరమా”
నాకు ఏమి చెప్పాలో తోచక ..”స్టేట్స్ లో ..సింగపూర్లో వుండే మీ పిల్లలు చెప్పారా?”అడిగాను.
“లేదు.ఈ మధ్య పని మీద ఒక డాక్టర్ గారింటికీ వెళ్ళాను.ఆయన చాలా స్థితిమంతుడు.అయినా ఇంట్లో తక్కువ వస్తువులు ..అవీ రోజు వారీ ఉపయోగానికి పనికి వచ్చేవి తప్ప అనవసరమైనవి లేవు.ఆరోగ్య రీత్యా ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది.”
నేను మరుమాట్లాడకుండా అతనితో ఉన్న పని పూర్తి చూసుకొని బయటకు వచ్చాను.
అతను చెప్పిన దాంట్లో వాస్తవం vaasthavam ఉందనిపించింది.


పేపర్లలో..పత్రికల్లో కథలు..కవితలు రాసుకునే చాలా మంది ఆన్ లైన్ మ్యాగజైన్ల మీద పడ్డారు..
ఒక ప్రముఖ డాక్టర్ గారికి సాహిత్యం అంటే చాలా ఇష్టం.అతను తెలుగులో ..ఆంగ్లంలో వ్యాసాలు..కథలు ..కవితలు తాను చదివి.. చదవమని నాకు పంపుతుంటారు.
నేను రాసినవి కూడా చదివి..బాగుంది లేనిది చెబుతారు.అతను పంపిన వన్నీ కూడా ఆన్ మ్యాగజైన్ లో పడినవే.నాకు కూడా ఒక ఆన్ లైన్ మ్యాగజైన్ పరిచయం చేసి..అందులో చదవమన్నారు.

‘ఈ ఆన్ లైన్ సాహిత్యమేమిటీ?’ అని
అని ఓ కవి గారిని కదలించాను. అతను చెప్పింది విని ఇంకా ఆశ్చర్య పోయాను.
కొద్ది కాలం క్రితం పుస్తకం హస్త భూషణం అంటే గర్వంగా తలాడించే వాళ్ళం. ఇంట్లో పుస్తకాలు గర్వంగా చూపించే వాళ్లం. కానీ రోజులు మారి పోయాయి.ఈ రోజు చదివిన వార్త చాలా బాధ కలిగిచింది.ఒక ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక తన ఉద్యోస్టులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉందట.అలాగే మిగతా భాషల పత్రికలు కూడా..
కారణం ఒక్కటే …జనమంతా చేతిలో పుస్తకం..పేపర్ కంటే మొబైల్ కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు.దానిలోనే ఈ పేపరు… ఒకటి కాదు నాలుగైదు ఫ్రీగా చదివేస్తున్నారు.ప్రతిదీ మొబైల్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇంటికొస్తే ల్యాప్ టాప్ లేదా సిస్టంలో యూ ట్యూబ్లో అన్ని చూస్తున్నారు.ఇందులో పుస్తకాలకి సమయ మెక్కడా????
కాలం మారుతోంది.పద్ధతులు మారుతున్నాయి.వాటితో మనం మారాలి ..లేకపోతే వెనకబడి పోతాం….అందుకే చాలామంది ఆన్ లైన్ లోకి వచ్చారు.
ఇంతకు ముందు బస్ స్టేషన్లో బుక్ స్టాల్స్ ఉండేవి.రకరకాల నవలలు..మాస..వార..దిన పత్రికలు వేలాడదీసేవారు.ఇప్పుడు అంతగా లేవు.ఉన్నా కూడా దినపత్రికలు మాత్రమే కొంటున్నారు.బస్సులో చదివి ..బస్సులోనే వదలి వెళ్తున్నారు.
పుస్తకాలకు పూర్వ వైభవం వస్తుందా???ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న..


ఇంతకు ముందు సాయంత్రమైతే చాలు ఫ్రెండ్స్ ని కలవడానికి పరుగోపరుగు… రోడ్డు పక్కన ఓ చెట్టు క్రిందనో..కిళ్ళీ కొట్టు దగ్గరో.. ..టీ స్టాల్ దగ్గరో అందరూ గుమిగూడి అన్ని సంగతులు చర్చించేవారు.
ఇప్పుడు గుంపుగా జనం రావటం లేదు.అన్ని ముచ్చట్లు ఫోన్ లొనే.ఎంతో అత్యవసరమైతే తప్ప కలిసేందుకు రావట్లేదు.చుట్టాల రాక పోకలు బాగా తగ్గిపోయాయి.
పొరపాటున ఎవరైనా దగ్గినా …తుమ్మినా ..అదేదో అంతర్జాతీయ నేరమైనట్టు అక్కడ ఎవరూ వుండటం లేదు.దూరంగా వెళ్లిపోతున్నారు.
దగ్గరి బంధువైనా..దూరపు చుట్టమైనా అనుమానితుడే….
మనుష్యులంతా ఎవరికి వారే ద్వీపాలై పోతున్నారు.
ఆస్పత్రి లో కరోన నయమయ్యాక కూడా ఇంటికి తీసుకు వెళ్లేందుకు బంధువులు నిరాకరిస్తున్నారు….ఇప్పటికి 66 మంది దాకా అక్కడే ఓ మూలన పడి ఉన్నారని ఈ రోజు ప్రముఖ దిన పత్రికలో వచ్చింది. . నయమయ్యాక ఇంటికి వెళ్లిన తరువాత కూడా అయినా వారి నుంచే కొత్త ఇబ్బందులు ఎదురుకొంటున్నారు వారు.

కన్నతల్లికి కరోన ఉందని అనుమానించి నిర్దయగా రోడ్డు మీద వదలి వేస్తున్న మారే ప్రపంచంలోకి మనం వెళ్లిపోతున్నాం..

@షేరు

3 thoughts on “అతను చెప్పిన దాంట్లో vaasthavam ఉందనిపించింది !!!!!”

Comments are closed.