VIDHYA VARADHI DD SAPTHAGIRI
AP ప్రభుత్వం విద్యార్థుల కొరకు విద్యావారధి వీడియో కార్యక్రమం దూరదర్శన్ సప్తగిరి చానల్ నందు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతిరోజు బోధన తరగతులను ప్రారంభించడం జరిగింది.
ఈ తరగతులను సోమవారం నుండి శనివారం వరకు తరగతుల వారీగా వారికి కేటాయించిన సమయంలో క్లాసులు ప్రసారం అవుతాయి.
మీ పిల్లలు ఏ తరగతులో ఉంటే వారికి కింద కేటాయించిన సమయంలో మీ టీవీలో డి డి సప్తగిరి ఛానల్ వారికి చూపించండి.
ఒకవేళ మీరే కారణం చేతనైనా క్లాస్ మిస్ అయితే యూట్యూబ్ ద్వారా మీరు తరగతులను మరలా చూడవచ్చు.
దూరదర్శన్సప్తగిరి చానల్ లో క్రింది సమయం ప్రకారం వారి తరగతులు చూసేలా/వినేలా ప్రోత్సహించ గలరు.
విద్యా వారధి – DD Sapthagiri online clasees timings
తరగతులు | సమయం |
1వ & 2వ | 11:00 a.m- 12:00 p.m |
3వ, 4వ & 5వ | 12:00 p.m – 01:00 p.m |
6వ & 7వ | 2:00 p.m – 3:00 p.m |
8వ & 9వ | 3:00 p.m – 4:00 p.m |
10వ |
10:00 am – 11:00am & 4:00 p.m-5:00 p.m |
Click Here for DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్
డీడీ సప్తగిరి ఛానల్ నెంబర్లు
సన్ డైరెక్ట్-189,
ఏపీ ఫైబర్-012,
టాటా స్కై-1498,
ఎయిర్ టెల్-947,
డిష్ టీవీ-1629,
వీడియోకాన్-703
WATCH DD SAPTAGIRI YOU TUBE LIVE : https://www.youtube.com/channel/UCcsvAreQ1IxIjWlBSpNEOWg
కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు సుమారు అయిదు, ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పుడే మరలా తెరుచు కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడటం లేదు. ప్రపంచంలో అత్యధిక కరుణ పాజిటివ్ కేసులు కలిగిన అమెరికా లాంటి దేశాలు కూడా ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తోంది . Covid 19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థ ఆన్లైన్ క్లాస్ ల రూపం లో నడుస్తుంది.
మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా విజృంభిస్తుంది… ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి సమయంలో పాఠశాలలు ప్రారంభం అయితే తీరని నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
ఒకవేళ మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని తలచిన క్షేత్రస్థాయిలో ఎన్నో ఆటంకాలు ఎదురుకావచ్చు.
పేద ,మధ్యతరగతి కుటుంబం వారు తమ పిల్లల ఆన్లైన్ కాసుల కోసం మొబైల్, టాబ్లు, లాప్టాప్, కంప్యూటర్స్, ఇంటర్నెట్ , వెబ్ కెమెరా, స్పీకర్స్ మొదలగునవి కొనడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
నిపుణులు కూడా ఆన్లైన్ క్లాసులు వలన విద్యార్థులకు వివిధ రకాల మానసిక శారీరక సమస్యలు మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు..
జూన్ నెలలో ఆన్లైన్ తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయ సంఘాలు (ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) నిర్వహించిన సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసులకు సుముకత చూపెట్టడం లేదు.