VOLTE ఫోన్ కాల్స్ ను వేరే వ్యక్తి విని రికార్డ్ చేయవచ్చు అని మీకు తెలుసా..?

స్మార్ట్ ఫోన్ లో 2g 3g 4g ఇలా నాల్గవ తరం కూడా దాటి 5వ తరానికి ఇంటర్నెట్ వేగం విస్తరిస్తున్న ఈ తరుణంలో మనకు ఫోన్ కాల్స్ చేసుకోవడానికి, డాటా ఇతరులకు పంపడానికి లేదా మనం పొందడానికి ,సినిమాలు చూడడానికి అదేవిధంగా వివిధ రకాల సేవలను త్వరితంగా పొందడానికి ఈ వేగం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ క్రమంలోనే మనం 2జి ఫోన్ కాల్స్ నుండి 4జి ఫోన్ కాల్స్ వరకు అప్డేట్ అయ్యాం అయితే ఈ మధ్య కాలంలో 4G LTE కాల్స్ వచ్చిన తర్వాత మరొక అప్డేట్ గా jio రంగ ప్రవేశం చేశాక మెల్లిగా అన్ని స్మార్ట్ఫోన్లలో 4జి తప్పనిసరి ఇవ్వడంతోపాటు వాయిస్ ఓవర్ LTE అనగా VOLTE సదుపాయాన్ని అన్ని మొబైల్ ఫోన్లు కల్పించాయి.

సాధారణంగా మనము ఏ ఫోన్ కాల్ మాట్లాడినప్పటికీ మన యొక్క కాల్ కు సంబంధించిన సమాచారాన్ని వివిధ నెట్వర్క్ కంపెనీలు ఎన్క్రిప్ట్ చేస్తాయి అందువల్ల మనం మన యొక్క సమాచారం చాలా భద్రంగా ఉంటుంది అన్న ధైర్యంతో ఉంటూ వస్తున్నాము.

అయితే ఇప్పుడు జర్మనీకి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు ఈ VOLTE ఫోన్ కాల్స్ లో ఒక ఒక లోపాన్ని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు అదేమిటంటే ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తున్న అప్పుడు మధ్యలో ఇంకొకరు ఆ కాల్ లో జాయిన్ అయి వారి యొక్క సంభాషణను పూర్తిగా రికార్డ్ చేయవచ్చు అని వారు తెలిపారు ఈ పద్ధతిని RE VOLTE పద్ధతిగా వారు తెలియజేశారు.

మనం చేసే ఫోన్ కాల్స్ టవర్ల ద్వారా నే ఇతరులకు చేరతాయి. అయితే ఒకే టవర్ ద్వారా అన్ని నెట్వర్క్ ఫోన్ కాల్స్ వెళుతున్నందున ఈ Encryption ప్రాసెస్ లో అందరూ కూడా అతిసాధారణమైన Encryption key ద్వారా Encrypt చేయడం వల్ల హ్యాకర్స్ ఆ Encrypted key ని సులభంగా గుర్తించే విధంగా ఉంది అని వారు తెలియజేసారు.

అయితే ఈ సమస్యను మనదేశంలో ఉన్న నెట్వర్క్ కంపెనీలు Encryption యొక్క keys difficulty ని పెంచడం ద్వారా అధిగమించవచ్చు.

error: Content is protected !!