భార్య మైనపు విగ్రహం తోనే తన నూతన గృహ ప్రవేశం కూడా చేశాడు

భార్య బ్రతికుండగానే ప్రత్యక్షంగా అనేక ఇబ్బందులు పెట్టే మగవాళ్ళు కొందరుంటారు, అదేవిధంగా భార్య ని కాలు కింద పెట్టకుండా చూసుకునే వారు ఉంటారు.

ఇలా ఒక్కోక్కరూ తమ జీవిత భాగస్వామి పైన ప్రేమ ను ఒక్కో రకంగా వ్యక్త పరుస్తూ ఉంటారు.

అదే కోవకు చెందిన మరో సంఘటన మీ..

కర్ణాటక లోని కొప్పల్ జిల్లా కు చెందిన శ్రీనివాస్ గుప్తా అనే ఒక వ్యక్తి తన భార్య యొక్క విగ్రహాన్ని తయారు చేయించాడు.

అంతేకాదు ఆ మైనపు విగ్రహం తోనే తన నూతన గృహ ప్రవేశం కూడా చేశాడు.

వివరాల్లోకెళ్తే..ఎంతో అన్యోన్యంగా తన భార్య అనుకోకుండా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల తనను శ్రీనివాస్ గుప్తా కోల్పోయాడు.

తన భార్య లేకుండా గృహ ప్రవేశం ఎలా అనుకొన్నాడో ఏమో..!? వెంటనే తన భార్య మైనపు విగ్రహం తయారు చేసి అచ్చు మనిషి లాగానే అలంకరించి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కళ్ళముందున్న భార్యను లెక్కచేయకుండా చూసే ఈ రోజుల్లో భార్య లేకపోయినా తన విగ్రహాన్ని చేసి ఇలా గృహప్రవేశం చేయడం ఆశ్చర్యకరమే అనుకోవాలి..