జీవాత్మ-పరమాత్మ

జీవాత్మ-పరమాత్మ
🙏 ఓం🙏
మాతృదేవత-పితృదేవతల పాద పద్మములకు నసమస్కరిస్తూ…

“ఈశ్వర: సర్వ భూతానాం సత్యశోధన తిష్ఠతి “

సమస్త ప్రానుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడని గ్రహించి,భూత దయ కలిగి, ఇతరుల మనస్సును నొప్పించకుండా, మితిమీరిన స్వార్ధాన్ని వీడి, అందరూ మనుగడ సాగించాలనే భావాన్ని కలిగి ఉండాలి. అలా జీవితం కొనసాగించి మరణం తర్వాత కూడా ఇతరుల హృదయాలలో జీవించగడమే అసలైన మోక్షం.

అందుకే ఈ ప్రపంచంలోని ప్రజలంతా అందరి మేలును తన మేలు గా భావిస్తూ,శత్రువులను మిత్రులను సమానంగా చూసే గుణాన్ని కలిగి ఉండాలి అంటాడు కబీరుదాసు. అంటే మనిషి రూపు రేఖలు, కులగోత్రాలు ప్రధానం కాదు…. నలుగురి మంచి కోరి అందరినీ సమానంగా చూడడమే మానవ ధర్మం.అదే మనిషి వ్యక్తిత్వానికి గుర్తు గా నిలుస్తుంది. ఒకరి నడవడిక ,ఆలోచనా విధానాలు, వాటిని వ్యక్తపరిచే విధానమే వారి వ్యక్తిత్వం అవుతుంది. క్రమశిక్షణ లేని మనసు శత్రువుగా మారుతుందని…… చక్కని శిక్షణ పొందిన మనసు మనిషికి స్నేహితునిగా వ్యవహరించి మంచి పేరు తెస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు…


మానవ చరిత్రలో ఎందరో మహానుభావులు తమ మంచి గుణాలతో రాణించి ప్రపంచాన్ని ప్రభావితం చేసి అద్భుతాలను సృష్టించారు. అందుకు వారి వారి వ్యక్తిత్వాలు కీలకంగా నిలిచాయని చెప్పవచ్చు.ఉదాహరణకు మన అబ్దుల్ కలాం గారు… అందుకే కబీర్ దాస్ చెప్పినట్టు మనిషికున్న సిరిసంపదలు చదువు ముఖ్యం కాదు మంచి గుణాలు ఆధ్యాత్మిక సంపదతో కూడిన వ్యక్తిత్వం మనిషిని మహనీయుని గా మారుస్తుంది.


కానీ ప్రస్తుతం తన పుట్టుకను కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు మానవులు.స్ర్తీ అయినా, పురుషుడైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్తము, మాంసము, చీము మొదలైన చండాలంలో తొమ్మిది నెలలు నిత్యం నరకం అనుభవిస్తూ ఉంటారు. గత జన్మ అనుభవాలను ఆ జీవిని అంటిపెట్టుకొని ఉంటాయి 9 నెలలు ముగిసిన వెంటనే భూ ప్రపంచం లోకి వస్తాడు .తల్లి అనే సాధనం ద్వారా జన్మి స్తారు.ఇది అంతా భగవంతుని సృష్టి. ఇక అప్పటినుంచి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం,అంతిమంగా మరణం.ఇదొక జీవిత చక్రం .ఐదు ఆ జీవి పాపపుణ్యాల ఆధారంగా తిరుగుతూ ఉంటుంది. ఈ జీవిత చక్రంలో ముఖ్యంగా యవ్వనం నుంచి చదువు, సంసారం అంటూ మానవునికి భగవంతున్ని స్మరించే సమయం దొరకడం లేదని చాలామంది అంటూ ఉంటారు.కానీ అది తప్పు ఏ వయసు వారైనా భగవన్నామం నిత్యం స్మరించడం అలవాటు చేసుకోవాలి. మన గుండె లయంతో సమానంగా భగవంతుని నామం కూడా గుండెల్లో ప్రతిధ్వనించాలి.ఈర్ష్య, ద్వేషాలు, కోపతాపాలు, దుర్గుణాలు అన్ని నిత్య నామంతో అనగద్రొక్కబడతాయి .అసంకల్పితంగా పరోపకారం, దైవసేవ, కారుణ్యం,కపటం లేకపోవడం ఇవన్నీ భగవంతుడు మనకు తెలియకుండానే మనకు ప్రసాదిస్తాడు. ఈ మాయా ప్రపంచం నుండి బయటపడడానికి భగవన్నామస్మరణ ఒకటే మార్గం అన్ని జన్మలలో మానవ జన్మ సర్వోత్తమము అయినది. గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేగాని ఈ మానవజన్మ రాదు.


🌹భగవంతున్ని పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.మనసులో భగవంతుని రూపాన్ని ధరించడం దేవునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం, నామ సంకీర్తన చేయడం వంటివన్నీ భగవంతుని పూజా విధానాలే. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞాలు, ద్వాపరయుగంలో అర్చనలు, కలియుగంలో భగవన్నామ సంకీర్తన భగవంతుని అనుగ్రహానికి మోక్షప్రాప్తికి తగిన సాధన అని శాస్త్రాల్లో చెప్పారు.


👉👉👉సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు, ఫలాపేక్ష వదిలి కర్మలు చేయాలని అదే నిష్కామ కర్మ యోగము అని గీతాచార్యుడు బోధించాడు. దీనివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది.ప్రతి పనిని భగవత్ కైంకర్యం అనే భావంతో చేయాలి. ఇదే కర్మ యోగము.
🚩🌙✝️కాబట్టి ప్రపంచంలో ఏ మతమైన చివరికి ధర్మం వైపు,సేవ వైపు, న్యాయం వైపు, ఆరోగ్యం వైపు,పరమాత్మ దగ్గరికి తీసుకుని పోయే ఆచార,వ్యవహార,సంప్రదాయ,సాధనలన్ని కూడా పొందడం మనిషికి అవసరం.వీటన్నింటి ద్వారా మనిషి ఆత్మను పరమాత్మలో కలుపుకుని,భగవంతుని సాక్షాత్కారం పొందుతాడు.
“మానవసేవే మాధవసేవ”
✍ఇరుగు యాదగిరి.